మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కీలక విషయాలు వెల్లడించారు. కేవలం స్వలింగ సంపర్కం, లైంగిక కలయికతోనే మంకీపాక్స్ వ్యాపించదని పేర్కొన్నారు. వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడం వల్లే ప్రధానంగా ఇది వ్యాప్తి చెందుతుందన్నారు. వ్యక్తి శరీరం, నోరు, ముఖాన్ని తాకడంతోపాటు నోటి తుంపర్ల ద్వారా ఇది వ్యాపిస్తుందని స్పష్టం చేశారు.