చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడంలో దోసకాయ కీలకంగా వ్యవహరిస్తుంది. దోసకాయలో ఉండే ఆస్కార్బిక్ ఆమ్లం, కెఫిక్ ఆమ్లం ముఖంలోని నీరు నిలుపుదలను అరికడుతుంది. ఫలితంగా ముఖం ఉబ్బినట్లు కనిపించదు.
దోసకాయలో విటమిన్ కె, సిలికా పుష్కలంగా ఉంటాయి. మిమ్మల్ని ఫిట్‌గా ఉంచడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యం ఉంచడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. దోసకాయ జ్యూస్ కళ్ళకు కూడా చాలా ఉపయోగకరం. ఇది కళ్లకు చల్లదనాన్ని ఇస్తుంది.