విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరిని రెగ్యులర్ చేస్తామని చెప్పిన మాట ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రవికుమార్ అన్నారు. ఆగస్ట్ 3న విజయవాడ లోజరిగే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సదస్సును జయప్రదం చేయాలని గోడపత్రాలు విడుదల రాజంపేటలో విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్టం లో ఉన్న 25, 000 మంది విద్యుత్ కార్మికులను సంస్థలో విలీనం చేసుకొని, రెగ్యులర్ చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకొని మా కుటుంబాల్లో వెలుగులు నింపాలని, ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని, డిమాండ్ చేశారు.