కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన స్వప్నకు భర్త,ఇద్దరు పిల్లలున్నారు. ఆమె వయస్సు 30 సంవత్సరాలు. స్వప్న తమ ఎదురింట్లో ఉండే 15 ఏళ్ల బాలునితో చనువు పెంచుకొని వివాహేతర సంబంధం పెట్టుకుంది. జూన్ 19న బాలున్ని తీసుకొని హైదరాబాద్ వెళ్లిపోయింది. బాలుని తండ్రి ఫిర్యాదుతో పోలీసులు వారి ఆచూకీని కనుగొని బాలున్ని తల్లిదండ్రులకు అప్పగించారు. స్వప్న వ్యవహారం చూసి భర్త, పిల్లలతో పాటు అంతా షాకయ్యారు. మహిళ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.