కేరళలోని కాసరగోడ్‌కు చెందిన మహమ్మద్ బవ లక్కీమ్యాన్‌గా పేరొందాడు. అతడికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల పెళ్లిళ్ల కోసం రూ.50 లక్షలు అప్పు చేశాడు. విధిలేక వాటిని తీర్చేందుకు ఇల్లు కూడా అమ్మేయాలనుకున్నాడు. అందుకు బేరం కూడా కుదుర్చుకున్నాడు. అయితే ఇటీవల రూ.50 పెట్టి కొన్న టికెట్‌కు అతడికి సోమవారం రూ.కోటి లాటరీ తగిలింది. దీంతో ఒక్కసారిగా అతడి కష్టాలన్నీ తీరిపోయాయి.