ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్కర సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తోంది ఎన్టీఆర్ ట్రస్ట్. మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆదేశాల మేరకు, సీఈవో రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహార పదార్థాలు,కూరగాయలు,తాగునీరు అందించడంతో పాటు,ఉచిత వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తోంది. ఇప్పటికే పార్టీ పరంగా టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాలలో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎల్లప్పుడూ ప్రజలకి అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు.