ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని సిక్కు గురుద్వారా వద్ద పేలుడు జరిగింది. తాజాగా కార్తే పర్వాన్ గురుద్వారా మెయిన్ గేట్‌కు సమీపంలో జరిగిన ఈ పేలుడు కలకలం సృష్టించింది. పేలుడులో భారతీయులెవ్వరూ గాయపడలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని ఇండియన్ వరల్డ్ ఫోరం అధ్యక్షుడు పునీత్ సింగ్ చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చెరలోకి వచ్చినప్పటి నుంచీ అక్కడి సిక్కు వర్గాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు.