పశ్చిమ బెంగాల్ లో రాజకీయ వేడి మొదలైంది. తమతో 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బీజేపీ నేత మిథున్ చక్రవర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. మహారాష్ట్ర తరహాలో కోల్ కతాల్లో కల్లోలం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.