ప్రభుత్వ ఉద్యోగం రాగానే భర్తను ఓ మహిళ వదిలేసింది. ఈ ఘటన బీహార్‌లో ఇటీవల జరిగింది. మాధేపురా జిల్లా కేదార్ ఘాట్‌కు చెందిన హరప్రీతితో మిథున్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆమె కోసం రూ.14 లక్షల వరకు మిథున్ ఖర్చు పెట్టాడు. ఇటీవల ఆమెకు పోలీసు జాబ్ రావడంతో మిథున్‌ను వదలేసింది. దీంతో న్యాయం చేయాలని సమస్తిపూర్ ఎస్పీని బాధితుడు ఆశ్రయించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa