వరదల్లో కొట్టుకుపోయి మరణించాడనుకున్న ఓ వ్యక్తి ప్రాణాలతో తిరిగివచ్చాడు. ఈ నెల 12న వరదల్లో కొట్టుకుపోయిన సురేశ్ 14 రోజుల తర్వాత మళ్లీ మంగళవారం ఆ పట్టణ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. కర్ణాటకలోని చిక్కమంగళూరులో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఓ కాలువ దాటుతుండగా సురేశ్ వరదలో కొట్టుకుపోయాడు. ఎంత గాలించినా దొరకలేదు. కానీ 14రోజుల తర్వాత వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. అధికారులు అతడిని కుటుంబసభ్యులకు అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa