ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యధిక జీతం పొందుతున్న భారతీయ సీఈవో ఇతనే

national |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 09:02 PM

మన దేశంలో అత్యధికంగా జీతం పొందుతున్న వారి జాబితాను ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ ఇటీవల విడుదల చేసింది. ఈ వార్షిక నివేదికలో గత ఏడాది తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సి.విజయ్‌కుమార్‌కు రూ.123.13 కోట్ల వేతనం అందించినట్లు పేర్కొంది. విజయకుమార్ వార్షిక మూల వేతనం రెండు మిలియన్లు కాగా, వేరియబుల్ పే కింద మరో మిలియన్ డాలర్లు పొందారని  తెలిపింది. మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి ఆయన 0.02 మిలియన్ల మొత్తం ఇతర ప్రయోజనాలను పొందారు. హెచ్ సీఎల్ కంపెనీ దీర్ఘకాలిక ప్రోత్సాహం కింద అందించిన 12.50 మిలియన్ల మొత్తంతో ఆయన జీతం16.52 మిలియన్లకు (రూ. 123.13 కోట్లు) చేరుకుందని పేర్కొంది. 


దీంతో విజయకుమార్ ప్రస్తుతం అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సీఈవోగా నిలిచారు. విజయకుమార్ ఆదాయంలో నాలుగింట మూడొంతులు దీర్ఘకాలిక ప్రయోజనాలతో పొందుపరచబడిందని కంపెనీ స్పష్టం చేసింది. తమ కంపెనీ నుంచి విజయకుమార్ ఎలాంటి వేతనం పొందలేదని, అయితే తమ అనుబంధ సంస్థ అయిన ‘హెచ్ సీఎల్ అమెరికా ఇంక్’ నుంచి దీర్ఘకాలిక ప్రోత్సాహకం సహా 16.52 మిలియన్ల డాలర్ల (రూ. 123. 13 కోట్లు) పారితోషికం అందుకున్నారని వార్షిక నివేదికలో పేర్కొంది.


‘12.5 మిలియన్ డాలర్ల దీర్ఘకాలిక ప్రోత్సాహకం అందుకోవడం మినహా 2021-22లో  ఆర్థిక సంవత్సరంలో విజయ్ కుమార్ వేతనంలో ఎటువంటి మార్పు లేదు. దీర్ఘకాలిక ప్రోత్సాహకం అనేది ఆయన చేరుకునే మైలురాళ్ల ఆధారంగా నిర్ణీత వ్యవధిలో (రెండు సంవత్సరాల ముగింపులో) చెల్లిస్తాం’ అని తెలిపింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com