ఎండుద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కిస్మిస్ తినడం వల్ల దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు తగ్గుతాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీ మరియు పేగు సమస్యలతో బాధపడే వారికి ఎండు ద్రాక్ష చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేనివారు రోజూ ఎండుద్రాక్షను తింటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.