కొత్తిమీర జీర్ణ సమస్యలను నివారించడంలో కొత్తిమీర బాగా పనిచేస్తుంది. కొత్తిమీర జ్యూస్ ను ఉదయాన్నే పరగడుపున తాగితే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి.కొత్తిమీర జ్యూస్ ను రోజూ తాగితే శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.కొత్తిమీరలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు అన్ని రకాల జ్వరాలను తగ్గిస్తాయి.కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది.జీర్ణకోశంలో గ్యాస్ ఉత్పత్తి కానివ్వదు. సులభంగా మూత్ర విసర్జన జరిగేట్టు చేసి కిడ్నీల ఆరోగ్యానికి కొత్తిమీర దోహదపడుతుంది.