కొలిమిగుండ్ల: మండల పరిధిలోని బి. తాడిపత్రి సమీపంలోని చెంచుగూడెంలో బుధవారం ఓ గుడిసెకు నిప్పుంటుకుని కాలిబూడిదైంది. దాదాపు 80 ఏళ్ల నుంచి చెంచు కుటుంబాలు ఇక్కడ గుడిసెలు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు.
అయితే గూడెంలో అంకమ్మ అనే గిరిజన మహిళ వంట చేసేందుకు కట్టెల పొయ్యి వెలిగించి పనిమీద బయటకు వెళ్లింది. గాలికి మంటలు గుడిసెకు తాకడంతో కాలిబూడిదైంది. స్థానికులు మంటలార్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.