ఏటీఎం మోసాలను అరికట్టేందుకు ఎస్బీఐ ఓటీపీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఖాతాదారులు ఏటీఎంలో రూ.10వేలకు మించి నగదు తీయాలంటే ఓటీపీ నమోదు చేయాలి. రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీని సరిగా నమోదు చేయకపోతే ఏటీఎం నుంచి డబ్బులు రావు. ఒక ఓటీపీ ద్వారా ఒకే ట్రాన్సక్షన్ చేయొచ్చు. ఇక బ్యాంకు ఖాతాలో రూ.లక్షకు మించి ఉంటే, ఎన్నిసార్లైనా నగదు తీసుకోవచ్చని ఎస్బీఐ వెల్లడించింది.