పిల్లలు కాలేరని మనోవేదనకి గురై గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. బీహార్ కు చెందిన రామ్ మెహత(27), ఆశ (19) లు సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరు హైద్రాబాదులోని కుతుబుల్లాపూర్ మండలానికి చెందిన పంచశీల కాలనీలో ఉంటున్నారు. వివాహం జరిగి సంవత్సరం దాటినా సంతానం కలగలేదని ఆశ తరచూ బాధపడుతుండేదని స్థానికులు తెలిపారు. బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆశ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.