మతిస్థిమితం లేని యువతిపై ఓ కామాంధుడు కన్నేసి అత్యాచారానికి పాల్పడిన ఘటన బొమ్మనహాల్ మండలంలోని ఓ గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. మతిస్థిమితంలేని 21ఏళ్ల యువతిని అదే గ్రామానికి చెందిన తిప్పయ్య మాయమాటలు చెప్పి దానిమ్మ తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీనంగా పడి వున్న ఆమెను చూసి కుటుంబీకులు అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ యుగంధర్ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.