గృహనిర్మాణపనులకు సంబంధించి ఇంకా ప్రారంభించని వాటిని వెంటనే ప్రారంభించి స్టేజి కన్వెర్షన్ వేగవంతంచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ అన్నారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నియోజకవర్గపరిధిలో గృహనిర్మాణ పనులపై రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 12505 గృహాలు మంజూరు అయ్యాయని 2396 నిర్మాణాలు బిబిఎల్ స్థాయిలో ఉన్నాయని మిగతా వివివిధ స్థాయిలలో ఉన్నాయని స్టేజి కన్వెర్షన్ వేగం పెంచాలన్నారు.