గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం ఓబులవారిపల్లి మండలం యల్లాయపల్లి గ్రామ సచివాలయ పరిధిలోని అప్పగుంటపల్లి ఎస్టీ కాలనీ నందు రైల్వే కోడూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీనివాసులు పర్యటించారు. జగనన్న ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ, అలాగే ఎవరికైనా అర్హత ఉండి కూడా వైయస్సార్ రైతు భరోసా, పెన్షన్లు, వైయస్సార్ ఆసరా, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక తదితర సంక్షేమ పథకాలు రాకున్నా ఉన్నట్లయితే అక్కడే ఉన్న సచివాలయ సిబ్బందితో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి, సర్పంచ్ నారాయణరెడ్డి, ఈశ్వరయ్య, రఫీ, ఎమ్మార్వో పీరు మున్ని, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.