హైదరాబాద్ లో క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. వీరు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖ నుంచి పేకాట రాయుళ్లను ప్రత్యేక విమానాలలో నేపాల్ తీసుకెళ్లి క్యాసినో ఆడిస్తున్నట్లు గుర్తించారు.
ప్రవీణ్ గత సంక్రాంతి సమయంలో వైసీపీ నేత కొడాలి నాని, వల్లభనేని వంశీలతో కలిసి గుడివాడలో క్యాసినో నిర్వహించాడు. కాబట్టి ప్రవీణ్ ఇంటితో పాటు నాని, వంశీల ఇళ్ళను కూడా ఈడీ సోదాలు చేయాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది.