వంతెనపై వేగంగా వస్తున్న ఓ కారు నదిలోకి దూసుకెళ్లిన దుర్ఘటన గోవాలో గురువారం జరిగింది. దక్షిణ గోవా జిల్లాలోని జువారి నది వంతెనపై నుంచి వస్తున్న కారు ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయింది. నదిలో పడిన కారును ఓ మహిళ నడుపుతోందని, కారులో నలుగురున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కోస్ట్ గార్డ్స్, నేవీ, ఎమర్జెన్సీ సర్వీసుల శాఖ కలిసి నదిలో పడిన వాహనంతో పాటు అందులో ఉన్నవారిని వెలికి తీసేందుకు గాలింపు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa