రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధురిపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. అధిర్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుపుతూ గురువారం మధ్యాహ్నం అతనికి నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 3వ తేదీ ఉదయం 11.30 గంటలకు విచారణ రావాల్సి ఉంటుందని ఆదేశించింది. వ్యాఖ్యల పట్ల లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.