నాలుగు సార్లు ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సెబాస్టియన్ వెటెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2022 సీజన్ చివరిలో తాను రిటైర్ అవుతానని గురువారం ప్రకటించాడు. ఆస్టన్ మార్టిన్ తరుపున పాల్గొంటున్న ఈ ఎఫ్1 దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు. అతను రెడ్‌బుల్ ఎఫ్1 జట్టు తరుపున డ్రైవింగ్ చేస్తూ 2010, 2011, 2012, 2013లో ఛాంపియన్షిప్లను గెలుచుకున్నాడు.