స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. వరుసగా రెండో రోజు భారీ లాభాలతో ముగియడం విశేషం. నేడు సెన్సెక్స్ 1041 పాయింట్లు, నిఫ్టీ 287 పాయింట్ల లాభాలతో ముగిశాయి. అయితే కొన్ని సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఎయిర్ టెల్, ఐటీసీ, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. అలాగే బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్ర, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి.