ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన సతీష్ బాబు అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. గుంటూరుకు చెందిన మహిళను ఈ ఏడాది జూన్ లో పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులయ్యాక డబ్బుల కోసం భార్యను వేధించాడు.
భార్య అతడి ఫోన్ ను పరిశీలించింది. ఓ మహిళతో చాటింగ్ చేసినట్లు గుర్తించి నిలదీసింది. సతీష్ హింసించడంతో పోలీసులను ఆశ్రయించింది. సతీష్ 5 పెళ్లిళ్లు చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.