తెలుగు రాష్ట్రాలలో పట్టణ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా దాదాపు నిరంతరాయంగా జరుగుతోందని కేంద్రం తెలిపింది. టీఆర్‌ఎస్ ఎంపీ నామ నాగేశ్వర రావు గురువారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఇలా బదులిచ్చారు.
పట్టణాలలో ప్రతిరోజూ 23.93 గంటలు, గ్రామాలలో 21.89 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఏపీలో పట్టణాలలో 23.89 గంటలు, గ్రామాలలో 23.62 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోందని వివరించారు.