క్షణిక సుఖం కోసం వావివరుసలు మరిచి నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూర్‌లో దారుణం జరిగింది. కంటికి రెప్పాలా కాపాడాల్సిన బాబాయే చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహనికి గురయ్యారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఆమె బాబాయ్‌ను తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలు తాళలేక అతడు మరణించాడు.