రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమైందని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు అన్నారు. గురువారం కడప నగరంలోని పాత బైపాస్ రోడ్డు సమీపంలో రూ. 75 లక్షలతో నిర్మించతలపెట్టిన కాలువ నిర్మాణానికి భూమిపూజ చేశారు. మేయర్, డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని, అలానే కడప నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు స్పష్టం చేశారు.