తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. మొత్తం 11 కంపార్టు మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. గురువారం శ్రీవారిని 67,364 మంది భక్తులు దర్శించుకోగా 25,058 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.21 కోట్లు వచ్చిందని తెలిపారు.