నాయుడుపేట మండలం భీమవరం లో శుక్రవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే టిటిడి బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య తమ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు గజమాలతో సత్కరించారు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పై ఆరా తీశారు అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందకుండా ఉంటే వారిని గుర్తించి పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో పరిశీలించి నాడు-నేడు ద్వారా చేపట్టిన పనులను తనిఖీ చేశారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి జడ్పిటిసి కట్టర్ జ్యోతి వైకాపా నాయకులు కట్టా వెంకట రమణారెడ్డి కామిరెడ్డి రాజారెడ్డి రాజేష్ కిషోర్ యాదవ్ గంధ వల్ల సిద్దయ్య, పలువురు వైకాపా నాయకులు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు