శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస నియోజకవర్గంలో మంచి పనికి శ్రీకారం చుట్టిన జనసైనికులు. వివరాల్లోకి వెళ్ళితే.... అయ్యా మా ఊరిలో ఉన్న చేతి బోరు పని చేయడం లేదు తాగడానికి నీళ్లు లేవు అని రెండు నెలలుగా సరుబుజ్జిలి మండలం, మూల సవలపురం,గ్రామంలో అధికార (YSRCP) ప్రతిపక్ష (TDP)నాయకులను అడగడం జరిగింది. కానీ ప్రభుత్వంలో ఉన్న వైసీపీ కానీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీడీపీ కానీ ఈ విషయం పై ఎటువంటి స్పందన చేకుండా పోయింది. అందు నిమ్మితం అడిగినా, పట్టించుకోకపోవడంతో సొంత డబ్బులతో చేతి బోరును బాగు చేసి గ్రామానికి నీళ్లు అందజేసిన స్థానిక జన సైనికులు.