గోదావరి ముంపు ప్రాంతమైన కూనవరం మండల కేంద్రంలో ఇళ్ల పరిస్థితి ఇది అని టీడీపీ నాయకులూ నారా చంద్రబాబు నాయుడు ఒక ఇంటిని చూపిస్తూ తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... గ్రామంలో ఓ బాధితుడు తన ఇంటిని స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి శుభ్రం చేసుకుంటున్నారు. మోకాలి వరకు పేరుకు పోయిన బురదలో ముక్కుపచ్చలారని చిన్నారులు పడుతున్న కష్టం చూస్తే బాధేస్తోంది. వరదొచ్చి పది రోజులు దాటుతున్నా ముంపు గ్రామాల్లో ప్రతి చోటా ఇదే పరిస్థితి. ఇదేనా బాధితులను ఆదుకునే తీరు? ఆ చిన్నారిని అడిగితే మీ ప్రభుత్వానికి నిజమైన మార్కులు వేస్తుంది. ఎవరు ఏ వరదలో ఏమై పోతే మనకేంటి అనుకుంటున్నారా?పరదాలు కట్టి పలకరింపులు కాదు..వాస్తవాలు తెలుసుకోండి..సాయం చేయండి అని ఆవేదన వ్యక్త పరిచారు.