national | Suryaa Desk | Published :
Fri, Jul 29, 2022, 12:02 PM
అసోంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. జొర్హాట్ నుంచి కోల్‌కతాకు వెళ్తున్న విమానం టేకాఫ్ అవుతుండగా రన్ వే నుంచి జారిపోయింది. రన్ వే పక్కనున్న బురదలో విమానానికి చెందిన ఒక చక్రం ఇరుక్కుపోయింది.
దీంతో ఈ విమాన సర్వీసును ఇండిగో ఆపివేసింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 98 మంది పాసింజర్లు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa