ఏపీలోని భీమవరంలో ఇద్దరు పోలీసులు లేడీ కానిస్టేబుల్ కోసం కొట్టుకున్నారు. విధుల్లో ఉన్న సీఐ, కానీస్టేబుల్ ఓ మహిళా కానిస్టేబుల్ కోసం వాగ్వాదానికి దిగారు. గొడవ కాస్త పెద్దది కావడతో.. ఆగ్రహంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు.
దీంతో అక్కడున్న పోలీసులందరూ షాకై.. వారిని ఆపాలని చూసినా లాభం లేకుండా పోయింది. ఈ ఘటన తాజాగా అక్కడ చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.