దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం ప్రారంభ ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ 600 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్ల మేర లాభపడింది. ఉదయం 10 గం.లకు సెన్సెక్స్ 653 పాయింట్ల లాభంతో 57,511 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతుండగా.. నిఫ్టీ 207 పాయింట్ల లాభంతో 17,136 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. 2092 షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. 667 షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.