ఉక్రెయిన్, రష్యాల మధ్య గత కొన్ని నెలలుగా భీకర యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదుల ప్రతినిధి గురువారం కీలక విషయాన్ని వెల్లడించారు. రష్యా జైలులో బందీలుగా ఉన్న 40 మంది ఉక్రెయిన్ సైనికులు ఉక్రెయిన్ బాంబు దాడి కారణంగా మరణించారని రష్యా ప్రతినిధి వెల్లడించారు. మరో 130 మంది గాయపడ్డారు. అయితే దీనిపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు.