ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పెయిన్ లో చట్టాలు అంత కఠినం మరి

international |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 10:51 PM

భారతదేశంలో చట్టాలు కఠినంగా లేకపోవడం వల్లే నేరస్థులు ఈజీగా తప్పించుకొంటారు అన్న విమర‌్శలు  ఉన్నాయి. ఇదిలావుంటే అంతర్జాతీయ పాప్ గాయని షకీరా (45) ఆదాయ పన్ను ఎగవేత కేసులో జైలు శిక్షకు గురయ్యే అవకాశాలున్నాయి. ఆదాయపన్నుకు సంబంధించి షకీరా మోసాలకు పాల్పడినట్టు స్పెయిన్ లో ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. షకీరాకు ఎనిమిదేళ్లకు పైగా జైలుశిక్ష విధించాలంటూ బార్సిలోనా కోర్టులో ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించారు. షకీరా 2012-14 మధ్యకాలంలో రూ.116 కోట్ల మేర స్పెయిన్ ప్రభుత్వానికి ఆదాయ పన్ను ఎగవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. కాగా, తదుపరి విచారణలో షకీరా కేసులో తుదితీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొలంబియాకు చెందిన షకీరా... స్పెయిన్ ఫుట్ బాల్ స్టార్ గెరార్డ్ పిక్ తో సహజీవనం చేసింది. 12 ఏళ్ల పాటు కలిసున్న వీరిద్దరూ ఇటీవలే విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిక్ తో అఫైర్ సందర్భంగా షకీరా తన మకాంను స్పెయిన్ కు మార్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com