తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు శుక్రవారం భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు .
భద్రాద్రి వద్ద కరకట్టను చంద్రబాబు పరిశీలించారు. ఇరవై ఏళ్ల క్రితం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మింపచేసిన కరకట్ట అది. ఆ కరకట్ట వల్లే భద్రాచలం సురక్షితంగా ఉందని ప్రజలు చంద్రబాబు తో చెప్పి సంతోషం వ్యక్తం చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa