ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక్కడికి వచ్చి శృంగారం చేయొద్దు: మిలటరీ మ్యూజియం విన్నపం

international |  Suryaa Desk  | Published : Mon, Aug 01, 2022, 11:13 PM

ఇటీవల సమాజం తలదించుకొనేలా బహిరంగ ప్రదేశాల్లో సైతం కొన్ని అభ్యంతరకర ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలండ్‌లోని ఓ మిలటరీ మ్యూజియం సందర్శకులకు వింత అభ్యర్థన చేసింది. మ్యూజియం చూడటానికి వచ్చిన సందర్శకులు.. కామ్‌గా చూసి వెళ్లిపోవాలని.. అంతేగానీ.. చారిత్రక ప్రదేశంలో శృంగారం చేయొద్దని అభ్యర్థించింది. సందర్శకులు సెక్స్‌లో పాల్గొనడం.. మ్యూజియంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో.. మ్యూజియం డైరెక్టర్ ఇలా స్పందించాల్సి వచ్చింది. పొలండ్‌లోని స్వినౌజ్‌సీ‌లో ఉన్న ఫోర్ట్ గెర్హార్డ్ మ్యూజియంను ఈస్ట్రన్ ఫోర్ట్ మ్యూజియం అని కూడా పిలుస్తారు. ఇటీవల ఈ మ్యూజియంను సందర్శిస్తున్న వారు.. చీకటిగా ఉండే మ్యూజియం మూలల్లోకి వెళ్లి రొమాన్స్ చేస్తున్నారు. సెక్యురిటీ కెమెరాల్లో ఇది రికార్డయ్యింది. దీంతో సందర్శకులు మ్యూజియంలో లైంగిక ప్రక్రియలో పాల్గొనొద్దని ఇటీవలే మ్యూజియం ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. ‘ఈ మ్యూజియంలోని చాలా వస్తువులు ఏళ్ల క్రితమే రూపొందాయి. ఇవి సాధారణ వస్తువులతో పోలిస్తే విభిన్నమైనవి. మీరు ఇలా చేస్తుండటం వల్ల సంప్రదాయవాదులు, సనాతన భావాలున్న వారు ఇబ్బంది పడుతున్నారు.. దయ చేసి సందర్శకులు అర్థం చేసుకోగలరు’ అని ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు. మ్యూజియం మొత్తం సెక్యూరిటీ కెమెరాలు అమర్చి ఉన్నాయని.. తామంతా గమనిస్తున్నామని... ఇక్కడ మీకు ఏకాంతం దొరకదని మ్యూజియం అధికార వర్గాలు సందర్శకులను హెచ్చరించాయి. సందర్శకులు శృంగారం చేసే కార్నర్ల ఫొటోలను సైతం పోలీష్ మ్యూజియం పోస్టు చేసింది. మ్యూజియం చేసిన ఈ పోస్టు పొలండ్‌ వాసులతోపాటు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. అయితే తామేం జోక్ చేయడం లేదని.. తమది పబ్లిసిటీ స్టంట్ కూడా కాదని మ్యూజియం డైరెక్టర్ పివోవార్జిక్ తెలిపారు. సెలవులు మొదలైన నెల రోజుల్లోపే.. ప్రేమికులు ఎంజాయ్ చేస్తున్న ఉన్న మూడు రికార్డింగులు మా దగ్గరున్నాయని పొలిష్ మీడియా సంస్థ గజెటా వైబోర్సిజాతో మ్యూజియం డైరెక్టర్ తెలిపారు. మ్యూజియంకు వచ్చే జంటలు.. ఇక్కడ చీకటిగా ఉండే మూలల్లో శృంగారం చేస్తున్నారు. అక్కడైతే తమను ఎవరూ చూడరని అనుకుంటున్నారు. కానీ మ్యూజియం మొత్తం సీసీటీవీ కెమెరాలున్నాయని పివోవార్జిక్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com