కురుపాం నియోజకవర్గం కేంద్రంలో ప్రభుత్వం వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా కొత్తగా మంజూరు చేసిన బడుగు బలహీన వర్గాలకు చెందిన అర్హులైన లబ్ధి దారులకు పెన్షన్ నగదును స్థానిక వైసీపీ నేత, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి అందజేయడం జరిగింది.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీల కు అతీతంగా , కులాలకు అతీతంగా , మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయంగా పెన్షన్ అందుతుందని వాలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటివద్దకే ప్రతినెలా పెన్షన్ అందిస్తారని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ,వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు,అధికారులు, వలుంటీర్లు పాల్గొన్నారు.