యువమోర్చా జాతీయ అధ్యక్షులు, MP తేజస్వి సూర్య , యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ మరియు పార్టీ సినియర్ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో యువత, మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన యువ సంఘర్షణ యాత్ర ను తిరుపతి ఎస్. వి యూనివర్సిటీ ప్రాంగణంలో అంబేద్కర్ మహనీయుని విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం ప్రారంభించడమైనది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ప్రజలకి తీరని అన్యాయం చేస్తుంది అని ఆరోపించారు. ప్రభుత్వాలు తమ తప్పులను తెలియజేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని తెలియజేసారు.