తాము ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్థులు కాకినాడలో చేపట్టిన ధర్నాకి జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ మద్దతు ఇచ్చారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పాఠ్య పుస్తకాలను వెంటనే అందించాలని, పిల్లల చదువును దూరం చేసే జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని, హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలను పెంచాలని, బైజుస్ ఒప్పందం రద్దు చేయాలని నానాజీ డిమాండ్ చేశారు.