కాకినాడ జిల్లా ఎస్పీ M. రవీంద్రనాథ్ బాబు ఆదేశాల ప్రకారం మహిళల భద్రత విషయంలో మరొక అడుగు ముందుకు వేసి కాకినాడ దిశ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది మరియు ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ సభ్యులైన భానుమతి, వసుధా రాణి, భవాని, కరాటే ట్రైనర్ నాగ తేజ ఆధ్వర్యంలో మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ను కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లో ప్రదర్శించి మహిళలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించడం జరిగింది.
ఎవరైనా మహిళలపై అనుకోని పరిస్థితుల్లో దాడులు చేసినప్పుడు తమను తాము రక్షించుకునేలా తర్ఫీదు నిచ్చే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించి మహిళలలో సెల్ఫ్ డిఫెన్స్ పై అవగాహన కల్పించడంతో పాటు వారిలో ఆత్మస్థైర్యం నింపేవిధంగా జిల్లా పోలీసులు కృషి చేస్తున్నట్లు SP ఈ సందర్భంగా తెలియజేశారు. కాకినాడ NTR బీచ్ కు వచ్చిన అందరూ ఈ విషయంలో హర్షం వ్యక్తం చేశారు.