కురుపాం నియోజక వర్గంలో కురుపాం మండలం కురుపాం సచివాలయం 1 పరిధి లో ఘనంగా గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమం మాజీ మంత్రి పాములా పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి తలుపు తట్టి వారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని వివరిస్తూ ప్రతి అవ్వకు ప్రతి అక్కకు , చెల్లెమ్మలకు ఉన్న కష్టాలను తెలుసుకోవడం జరిగింది.
గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంను ఎంపీపీలు, జెడ్పీటీసీలు మరియు ఎంపీటీసీలు, సర్పంచ్ లు ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు,అధికారులు మరియు వాలంటీర్లతో పాటు కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వాళ్లకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరిగింది.