నేరారోపణ రుజువు చెయ్యబడి శిక్ష అనుభవించి విడుదలకు అర్హులైన విచారణ ఖైదీలకు సత్వరమే న్యాయ సహాయం అందించి వారికి విముక్తి కల్పించేందుకుగాను విచారణ ఖైదీల సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించినట్లు గౌరవ మొదటి అడిషనల్ జడ్జి చిన్నంశెట్టి రాజు గారు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మచిలీపట్నం లోని జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ మందిరంలో జిల్లా స్థాయి అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశం మొదటి అడిషనల్ జడ్జి అధ్యక్షతన జరిగింది.