ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 02, 2022, 05:02 PM

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం  నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి విచ్చేసినారు. ప్రజల సమస్యలకు సంబంధించి 91 ఫిర్యాదులు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ స్వీకరించినారు. 


ప్రజలు పోలీస్ వారికి స్వేచ్చగా తమ సమస్యలను విన్నవించుకునే వాతావరణాన్ని కల్పించాలని,ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా వ్యవహరించి,సానుభూతితో వారికి సేవాలందించాలని ఎస్పీ తెలిపారు.


మోసాలు, బెదిరింపులు,దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని,భవిష్యత్తులో వారు మరలా అటువంటి కార్యకలాపాలకు పాల్పడకుండా తగిన రీతిలో కౌన్సెలింగ్ నిర్వహించాలని పోలీస్ అధికారులకు  ఎస్పీ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com