కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS., గారు వార్షిక తనిఖీలలో భాగంగా సోమవారం కాకినాడ సబ్ డివిజన్ లోని గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఎస్పీ పోలీస్ స్టేషన్ ప్రాంగణ పరిసరాలను చూసి పరిశుభ్రంగా ఉంచవలసినదిగా ఆదేశించినారు.
తదుపరి స్టేషన్ నిర్వహణ, రిసెప్షన్ కౌంటర్, కేస్ ప్రాపర్టీ, రిపోర్టు కాబడిన మహిళలకు సంబంధించిన కేసులు, గ్రేవ్ మరియు నాన్ గ్రేవ్ కేసులను విశ్లేషించి, పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన విచారణను పూర్తి చేయాలని, పోలీస్ స్టేషన్ స్టేషన్ రికార్డులు, కేస్ CD ఫైల్స్ ను పరిశీలించి సక్రమంగా నిర్వహించాలని, నాటుసారాయి తయారీ, అమ్మకాలు, అక్రమ మద్యం రవాణా పై ప్రత్యేక దృష్టి సారించి వాటి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవాలని SI కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో గల స్థానిక శాంతి భద్రతలు మరియు ఇతర ప్రాధాన్యత గల విషయాలపై గొల్లప్రోలు SI, పిఠాపురం CI లతో కూలంకషంగా చర్చించారు.