దక్షిణాఫ్రికాలో అత్యాచారాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అయితే దేశంలో సగటున ప్రతి 12 నిమిషాలకు ఒక నేరం నమోదవుతుంది. ఇదిలావుంటే దక్షిణాఫ్రికాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మ్యూజిక్ వీడియో షూట్ కోసం వెళ్లిన మోడల్స్‌పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొంతమంది ముఠాగా వెళ్లి తుపాకులతో బెదిరించి ఎనిమిది మంది యువతులను రేప్ చేశారు. జోహన్నెస్‌బర్గ్‌కు పశ్చిమాన ఉన్న చిన్న పట్టణమైన క్రుగర్స్‌డోర్ప్ శివార్లలో గురువారం ఇది జరిగింది. ఈ ఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక భద్రతా బలగాలు ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
మ్యూజిక్ షూట్ కోస వెళ్లిన బృందం తమ సామగ్రిని అప్‌లోడ్ చేసి సెట్‌ను సిద్ధం చేసుకుంటున్న సమయంలో కొంతమంది దుండగులు తుపాకులతో అక్కడకు వెళ్లారు. వారిపై దాడి చేశారు. అక్కడున్న 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల మోడల్స్‌పై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అంతేకాదు ఆ బృందంలోని ఇతర మగవాళ్ల పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. వారి దుస్తులను విప్పించి, వారి వస్తువులను దోచుకున్నారు. ఆ నిందితులను వెంటనే పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని స్థానిక అధికారులు చెప్పారు.