మనం నీళ్లలోకి దిగేముందు వాటి లోతుపాతులను తెలుసుకొని వెళ్లాలి. లేకపోతే మనం మనవాళ్లను సోకసముద్రంలోకి నెట్టేసినోళ్లమవుతాం. ఇలాంటి విషాదకర ఘటనే తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సరస్సులో స్నానం చేయడానికి వెళ్లిన ఏడుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉనా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే గోవింద్ సాగర్‌లో మునిగి మృతి చెందిన వారిని పంజాబ్‌కు చెందిన వారిగా గుర్తించారు. మొహాలీకి చెందిన 11 మంది యువకులు బాబా బాలక్ నాథ్ ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చి సరదాగా సోమవారం మధ్యాహ్నం దగ్గర్లోని సరస్సులో స్నానానికి దిగారు.
అయితే సరస్సు లోతు ఎక్కువగా ఉండడంతో వారతా మునిగిపోయారు. అందులో నలుగురు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మిగతావారిని కాపాడేందుకు ప్రయత్నించారు. గాని కోసం గట్టిగా కేకలు వేయగా స్థానికులు వారిని కాపాడేందుకు కృషి చేశారు. కానీ అప్పటికే వారంతా నీటిలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం గాలించారు. చాలా గంటలు శ్రమించిన తర్వాత చివరకు మృతదేహాలను వెలికి తీశారు.
ఈ ఘటనలో ఏడుగురు యువకులు చనిపోయినట్టు బంగానా ఎస్‌డీఎం యోగరాజ్ ధీమాన్ పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా మగవారేనని, వారిలో ఆరుగురు 16 నుంచి 18 ఏళ్లలోపు వారేనని, ఒకరికి 30 ఏళ్ల వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో పవన్, రమణ్ కుమార్, లబ్‌సింగ్, లఖ్వీర్ సింగ్, అరుణ్ కుమార్, విశాల్ కుమార్, శివ ఉన్నారు. వీరంతా బానూద్‌లో ఉండే వ్యక్తులుగా తెలుస్తుంది.