నిస్సహాయుడైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇద్దంతా ఓ సెల్పీ వీడియో లో తన మరణానికి ముందు చిత్రీకరించాడు. వివరాలలోకి వెళ్లితే..విశాఖలో భార్య చేసిన పనికి భర్త బలయ్యాడు. మనసులో బాధ ఎవరికీ చెప్పుకోలేక కుంగిపోయాడు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కొత్తవీధి ఈ ఘటన జరిగింది. కొత్తవీధికి చెందిన కామిరెడ్డి దుర్గాప్రసాద్‌కు ఓ మహిళతో వివాహమైంది. సంసారం సాఫీగా సాగిపోతోంది.. భార్య ఓ షాపింగ్ మాల్లో ఉద్యోగం చేస్తోంది. ఇంతలో సెల్ఫీ వీడియో విడుదల చేసి దుర్గా ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యను వేరొక వ్యక్తి తీసుకెళ్లాడని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నాడు. ఆ అవమానం భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నట్లు వీడియోలో చెప్పుకొచ్చాడు.
తన చావుకు నవీన్, నాగలక్ష్మిలు కారణం అన్నారు. తన బావమరిది కూడా ఓ కారణమని.. అతడు నాటకాలు ఆడాడని ఆరోపించాడు. బతికి సాధిద్దామనుకున్నా కానీ కడుపుమంట, ఆవేదనతో ప్రాణాలు తీసుకుంటున్నాను అన్నాడు. నవీన్ అనే వ్యక్తి ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నాడని.. ఐదు నెలల నుంచి తిరుగుతున్నా ఇలాంటి వెదవల్ని వదిలేసి.. అమాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకొని తన బాధను చెప్పుకొచ్చాడు. తాను ప్రాణాలు తీసుకోవడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు దుర్గా ప్రసాద్.